
‘టెంపర్’ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఫుల్ జోష్ మీదున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తన తదుపరి సినిమా షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. విభిన్న చిత్రాల దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. సినిమా షూటింగ్ మొదలు పెట్టిన రోజే ఎన్.టి.ఆర్ మోస్ట్ స్టైలిష్ లుక్ కి సంబందించిన కొన్ని ఫోటోలను రిలీజ్ చేసారు. ఈ ఫొటోస్ లో ఎన్.టి.ఆర్ ట్రై చేసిన లుక్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా మెప్పించింది. తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఇండిపెండెన్స్ డే కానుకగా ఓ గిఫ్ట్ ప్లాన్ చేసాడు.
స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఎన్.టి.అర్ సుకుమార్ సినిమాలోని ఓ స్పెషల్ స్టిల్ ని రిలీజ్ చేయనున్నాడు. ఈ స్టిల్ అందరినీ థ్రిల్ చేసేలా ఉంటుందని సమాచారం. ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ కారణంగానే స్వాతంత్ర్యదినోత్సవం రోజున ఓ స్పెషల్ స్టిల్ ని రిలీజ్ చేయనున్నారని సమాచారం. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. సెప్టెంబర్ దాకా లండన్ లోనే షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాకి బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

