
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – పూరి జగన్నాధ్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి మీకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సగం పార్ట్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఈ మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. మాకు అందిన తాజా సమాచారం ప్రకారం ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో పూర్తి స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ స్పెషల్ స్టైలిష్ లుక్ ని స్వయంగా పూరి జగన్నాధ్ దగ్గరుండి డిజైన్ చేసాడు.
ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న ఈ మూవీని బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర టీం జనవరి 9న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అవ్వడంతో ప్రొడక్షన్ టీం ఏం కావాలన్నా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, ఆలస్యం చేయకుండా రిలీజ్ చేస్తున్నారు. వక్కంతం వంశీ కథని అందించిన ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.