‘అమెరికా’ బోతే ‘నువ్వైతవ్ర లంగా’ !

‘అమెరికా’ బోతే ‘నువ్వైతవ్ర లంగా’ !

Published on Jul 4, 2019 5:22 PM IST

టైటిల్ తో పాటు ఫన్నీ కాన్సెప్ట్ తో కొత్తగా రాబోతున్న చిత్రం ‘ప్రెజర్ కుక్కర్’. సుజయ్ – సుశీల్ దర్శకత్వంలో సాయి రోనాక్ – ప్రీతీ ఆష్రాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం నుండి తాజాగా మొదటి సాంగ్ ‘నువ్వైతవ్ర లంగా’ పాట విడుదలైంది. మొత్తానికి ఈ సాంగ్ సరదాగా సాగుతూ లోకల్ ఫీలింగ్ ను హైలెట్ చేస్తూ.. యూత్ కి బాగా నచ్చే అంశాలతో మరియు టేకింగ్ తో బాగా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ సాంగ్ కి సాహిత్యం, సంగీతం మరియు సింగర్ రాహుల్ సిప్లిగుంజినే కావడం విశేషం.

అయితే, మనిషి జీవితంలో ముఖ్యమైన అంశాలు జాబ్, చదువు, ప్రేమ, పెళ్లి వంటి ప్రధాన విషయాలతో జనం ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొకుంటున్నారనే థీమ్ ఆధారంగా ఈ ‘ప్రెజర్ కుక్కర్’ చిత్రం పూర్తి వినోదభరిత చిత్రంగా రాబోతుంది. కారంపూరి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అన్నపరెడ్డి అప్పిరెడ్డి, సుజోయ్, సుశీల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు