ప్రముఖ నిర్మాత చేతికి ఆక్వామెన్ తెలుగు వర్షన్ హక్కులు !

ప్రముఖ నిర్మాత చేతికి ఆక్వామెన్ తెలుగు వర్షన్ హక్కులు !

Published on Nov 17, 2018 10:10 AM IST

హాలీవుడ్ చిత్రం ‘ఆక్వామెన్’ విడుదల కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈచిత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు ,హిందీ , తమిళ భాషల్లో విడుదలవుతుంది.

ఇక ఈచిత్రం ‘సముద్ర పుత్రుడు’ పేరుతో ఈ డిసెంబర్ 14న విడుదలవుతుంది. ఈ చిత్రం యొక్క తెలుగు వర్షన్ హక్కులను ఎన్ వీఆర్ సినిమాస్ అధినేత ఎన్ వి ప్రసాద్ దక్కించుకున్నారు. ‘ది కంజురింగ్, ది కంజురింగ్ 2 , ఫ్యూరియస్ 7’ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు జేమ్స్ వన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు . వార్నర్ బ్రదర్స్ , డీసీ కామిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం 2డి తో పాటు 3డి లోను విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు