అఫీషియల్ : ‘NBK 109’ మూవీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఆనిమల్’ విలన్

అఫీషియల్ : ‘NBK 109’ మూవీలోకి ఎంట్రీ ఇచ్చిన ‘ఆనిమల్’ విలన్

Published on Apr 23, 2024 9:05 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఊర్వశి రౌటేలా హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెట్స్ లోకి నేడు ఆనిమల్ విలన్ బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చారు.

సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ లో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. బాలకృష్ణ పవర్ఫుల్ రోల్ చేస్తున్న ఈ మూవీ నుండి త్వరలో ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు