అఫీషియల్ : బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు – 2’ అనౌన్స్ మెంట్

అఫీషియల్ : బ్లాక్ బస్టర్ ‘ప్రేమలు – 2’ అనౌన్స్ మెంట్

Published on Apr 20, 2024 12:31 AM IST

ఇటీవల మలయాళంలో రిలీజ్ అయిన రామ్ కామ్ ఎంటర్టైనర్ మూవీ ప్రేమలు అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. గిరీష్ ఏడి తెరకెక్కించిన ఈ మూవీని భావన స్టూడియోస్, ఫహద్ ఫాసిల్ అండ్ ఫ్రెండ్స్, వర్కింగ్ క్లాస్ హీరో సంస్థల వారు గ్రాండ్ గా నిర్మించారు. మమితా బైజు మరియు నస్లెన్ కె గఫూర్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీకి విష్ణు విజయ్ సంగీతం అందించారు.

తెలుగులో ఈ మూవీని రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేయగా ఇక్కడ కూడా మంచి సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక మ్యాటర్ ఏమిటంటే, నేడు ఈ మూవీ యొక్క సీక్వెల్ ప్రేమలు 2 ని అనౌన్స్ చేసారు మేకర్స్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ప్రేమలు 2 మూవీ 2025 లో థియేటర్లలోకి రానుంది. అలానే ఈ మూవీ యొక్క తెలుగు వెర్షన్‌ను కూడా కార్తికేయ రిలీజ్ చేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు