అఫీషియల్ : ‘దసరా’ కాంబో మరొక్కసారి రిపీట్

అఫీషియల్ : ‘దసరా’ కాంబో మరొక్కసారి రిపీట్

Published on Mar 30, 2024 6:09 PM IST

నాచురల్ స్టార్ నాని ఇటీవల యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన హాయ్ నాన్న మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్నారు. ఇక అంతకముందు మరొక యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆయన చేసిన మాస్ యక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సొంతం చేసుకుంది.

విషయం ఏమిటంటే, దసరా మూవీ రిలీజ్ అయి నేటికి ఏడాది పూర్తి కావడంతో మరొక్కసారి శ్రీకాంత్ తో తన నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసారు నాని. నాయకుడిగా ఉండటానికి మీకు గుర్తింపు అవసరం లేదు అంటూ ఈ మూవీ యొక్క కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో నాని సిగరెట్ కాలుస్తున్న సీన్ చూడవచ్చు. ఇక దసరా మూవీని నిర్మించిన ఎస్ఎల్వి సినిమాస్ సంస్థ పై సుధాకర్ చేరుకూరి దీనిని కూడా గ్రాండ్ గా నిర్మించనున్నారు. నాని కెరీర్ 33వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు