అఫీషియల్ : నిఖిల్ భారీ ప్రాజెక్ట్ లోకి ఆసక్తికర మేకోవర్ తో ‘ఇస్మార్ట్’ హీరోయిన్

అఫీషియల్ : నిఖిల్ భారీ ప్రాజెక్ట్ లోకి ఆసక్తికర మేకోవర్ తో ‘ఇస్మార్ట్’ హీరోయిన్

Published on Apr 4, 2024 10:19 AM IST


టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఇప్పుడు మరిన్ని ఆసక్తికర చిత్రాలు చేస్తూ వస్తున్నాడు. మరి ఈ చిత్రాల్లో భారత్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “స్వయంభు” కూడా ఒకటి. మరి సినిమా ఫస్ట్ లుక్ నుంచే మంచి ఆసక్తి రేపుతూ వస్తున్నా ఈ సినిమా కోసం నిఖిల్ తన కెరీర్ లోనే అత్యధిక ఎఫర్ట్స్ ని పెడుతున్నాడు. ఇక ఇవాళ ఓ స్పెషల్ అప్డేట్ ని ఇస్తున్నట్టుగా నిన్న మేకర్స్ రివీల్ చేయగా దీనిపై ఇప్పుడు అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది.

ఈ చిత్రంలో “ఇస్మార్ట్ శంకర్” బ్యూటీ నభా నటేష్ కూడా ఉన్నట్టుగా ఆ మధ్య రూమర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ చిత్రంలో ఆల్రెడీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఫిక్స్ కాగా తమ ప్రపంచంలోకి వచ్చిన మరో బ్యూటీ వచ్చినట్టుగా ఒక బ్యూటిఫుల్ పోస్టర్ తో రివీల్ చేశారు. మరి ఇందులో నభా ఎంతో అందంగా కనిపిస్తుంది.

అలాగే వీడియోలో ఆమె నటిస్తున్న పాత్రకి మేకోవర్ తో ఆసక్తిగా కనిపిస్తుండగా సెట్స్ లో నిఖిల్ ని కలిసినట్టుగా చూపించారు. మరి ఈమె రాకతో ఈ సినిమాపై అందరిలో మరింత ఆసక్తి పెరిగింది. ఇక ఈ భారీ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తుండగా ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు