అఫీషియల్ : ‘భారతీయుడు 2’ విడుదల తేదీ అదే

అఫీషియల్ : ‘భారతీయుడు 2’ విడుదల తేదీ అదే

Published on May 19, 2024 10:08 PM IST


శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఈ చిత్రం జూలైలో థియేటర్లలో విడుదల కానుందని కమల్ హాసన్ ఇప్పటికే వెల్లడించారు. ఐతే, తాజాగా ఈ యాక్షన్ థ్రిల్లర్ జూలై 12, 2024 న థియేటర్స్ లోకి రాబోతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మే 22న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో తొలి పాటను విడుదల చేయడం ద్వారా మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తున్నారు.

కాగా ఈ మూవీని లైకా ప్రొడక్షన్స్, రెడీ జెయింట్ మూవీస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్‌ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, బాబీ సింహా, SJ సూర్య, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని మరియు బ్రహ్మానందం కీలక పాత్రలు పోషిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు