అఫీషియల్ : ‘చంద్రముఖి – 2’ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్


కొన్నేళ్ల క్రితం పి వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా రూపొందిన థ్రిల్లింగ్ హర్రర్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ చంద్రముఖి. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగులో సైతం సూపర్ హిట్ కొట్టింది. ఇక మళ్ళి చాలా గ్యాప్ తరువాత దానికి సీక్వెల్ గా ప్రస్తుతం చంద్రముఖి 2 మూవీ పట్టాలెక్కుతోంది. రాఘవ లారెన్స్ హీరోగా పి వాసు తీయనున్న ఈ మూవీని ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఎంతో గ్రాండ్ గా నిర్మించనుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అలానే ఆర్ డి రాజశేఖర్ ఫోటోగ్రఫీని అందించనున్నారు.

కాగా ఈ ప్రతిష్టాత్మక మూవీలో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనావత్ నటించనున్నారు. నిజానికి ఆమె చంద్రముఖి 2 లో నటించనున్నారు అనే వార్త గత కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్నప్పటికీ దీనిపై కొద్దిసేపటి క్రితం టీమ్ నుండి అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ వచ్చింది. తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్న ఈ మూవీలో వడివేలు, రాధికాశరత్ కుమార్ వంటి వారు కీలక పాత్రలు చేస్తున్నారు. కాగా అతి త్వరలో ఈ మూవీకి సంబందించిన అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రానున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version