అఫీషియల్: “విశ్వంభర” లోకి “నా సామిరంగ” బ్యూటీ

అఫీషియల్: “విశ్వంభర” లోకి “నా సామిరంగ” బ్యూటీ

Published on May 24, 2024 11:45 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష కృష్ణన్ హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ తారాగణం కూడా ఉంది.

ఇప్పటికే చిరు కి సోదరి పాత్రల్లో పలువురు ప్రముఖ నటీమణులు కనిపిస్తున్నట్టుగా తెలిసిందే. అయితే ఈ చిత్రంలో మరో అదనపు ఆకర్షణ ఇప్పుడు చోటు చేసుకుంది. అమిగోస్, నా సామిరంగ బ్యూటీ యంగ్ హీరోయిన్ ఆషికా రంగనాథ్ అయితే ఈ చిత్రంలో నటిస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు అఫీషియల్ గా ప్రకటించేసారు.

మరి రీసెంట్ గానే ఆషిక తాను ఈ భారీ ప్రాజెక్ట్ లో ఉన్నట్టుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీనితో ఇప్పుడు ఈమె ఉన్నట్టుగా మేకర్స్ అధికారికంగానే చెప్పేసారు. ఇక ఈ చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న బ్రహ్మాండమైన రిలీజ్ తో రాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు