అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్

అఫీషియల్ : నేడు ‘కల్కి 2898’ నుండి స్పెషల్ అప్ డేట్

Published on Apr 21, 2024 1:28 AM IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ లో కల్కి 2898 ఏడి మూవీ ఒకటి. దీనిని గ్రాండ్ లెవెల్లో వైజయంతి మూవీస్ సంస్థ పై సి. అశ్వినీదత్ నిర్మిస్తుండగా నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ జానర్ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కనిపించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో దిశా పటాని కూడా మరొక కీలక పాత్ర చేస్తున్నారు.

విషయం ఏమిటంటే, సమయం వచ్చింది అంటూ అమితాబ్ బచ్చన్ పోస్టర్ ని తాజాగా రిలీజ్ చేసిన మేకర్స్, అఫీషియల్ గా నేడు సాయంత్రం 7 గం. 15 ని. లకు ఒక స్పెషల్ అప్ డేట్ ని అందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచెస్ జోరుగా జరుగుతుండడంతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ లో ఆ అప్ డేట్ ని అందించనున్నారు. దానితో మెజారిటీ ఆడియన్స్ కి తమ మూవీ అప్ డేట్ గురించి తెలుస్తుందనేది కల్కి 2898 ఏడి మేకర్స్ ఆలోచన. అయితే ఈ అప్ డేట్ లో మూవీ న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారని అంటున్నాయి సినీ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు