అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..

అఫీషియల్ : ఈ తేదీన ఓటిటిలో “ఫ్యామిలీ స్టార్” వచ్చేస్తున్నాడు..

Published on Apr 24, 2024 1:51 PM IST

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కించిన అవైటెడ్ లేటెస్ట్ చిత్రం “ది ఫ్యామిలీ స్టార్”. మరి ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం వాటిని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫైనల్ గా ఓటిటి రిలీజ్ కి సిద్ధం అయ్యింది.

ఈ సినిమా ఓటిటి హక్కులు ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అందులో ఈ చిత్రం ఈ ఏప్రిల్ 26న వస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. ఇప్పుడు వీటిని నిజం చేస్తూ అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ప్రైమ్ వీడియోలో ఇదే ఏప్రిల్ 26న వస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.

మరి ఈ చిత్రం అందులో తెలుగు సహా తమిళ్ మరియు మళయాళ కన్నడ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే హిందీలో మాత్రం కొన్నాళ్ల తర్వాత స్ట్రీమింగ్ కి రానుంది. ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు