అఫీషియల్ : భారీ మొత్తానికి “పుష్ప 2” ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకుంది వీరే

అఫీషియల్ : భారీ మొత్తానికి “పుష్ప 2” ఓవర్సీస్ హక్కులు సొంతం చేసుకుంది వీరే

Published on May 1, 2024 4:10 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా సినిమా దగ్గర సెన్సేషనల్ సీక్వెల్ గా ఎన్నో అంచనాలు సెట్ చేసుకుంది. ఇక దీనితో పాటుగా ఈ చిత్రానికి జరుగుతున్న బిజినెస్ పరంగా కూడా సాలిడ్ బజ్ బయటకి వచ్చింది.

ఇక వీటితో ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా భారీ మొత్తానికే హక్కులు అమ్ముడుపోయినట్టుగా కొన్ని రూమర్స్ వచ్చాయి. అయితే ఫైనల్ గా ఈ సినిమా ఓవర్సీస్ హక్కులు ఎవరు సొంతం చేసుకున్నారు అనేది ఇప్పుడు రివీల్ అయ్యింది. ఈ చిత్రం నార్త్ అమెరికా మార్కెట్ లో ఏఏ క్రియేషన్స్ వారు సొంతం చేసుకున్నారు. సో ప్రపంచ వ్యాప్తంగా ఇండియా మినహా పుష్ప 2 వీరి నుంచే వెళ్లనుంది.

అలాగే యూఎస్ మార్కెట్ లో ప్రత్యంగిరా సినిమాస్ వారితో కలిపి రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. ఆల్రెడీ వీరి నుంచి గుంటూరు కారం, సలార్ లాంటి భారీ సినిమాలు వచ్చాయి. ఇపుడు పుష్ప 2 రాబోతుంది. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఆగస్ట్ 15న సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు