అఫీషియల్ : అజిత్ భారీ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్.!

అఫీషియల్ : అజిత్ భారీ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్.!

Published on Jan 17, 2024 1:01 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో థలా అజిత్ కుమార్ హీరోగా ప్రస్తుతం నటిస్తున్న అవైటెడ్ భారీ చిత్రం “విడా ముయార్చి” కోసం తెలిసిందే. మరి అజిత్ కెరీర్ లో ఇది 62వ సినిమా కాగా దర్శకుడు మగిజ్ తిరుమేణి తెరకెక్కిస్తున్నాడు. మరి ఎంతో కాలం గ్యాప్ తర్వాత రీసెంట్ గానే అజిత్ ఈ సినిమాని స్టార్ట్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఎవరు అనేది అధికారికంగా ఇప్పుడు రివీల్ అయ్యింది. దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ అతి త్వరలోనే సినిమా రిలీజ్ ఓటిటిలో ఉంటుంది అని కన్ఫామ్ చేశారు. మరి తమిళ్ సహా తెలుగు మరియు కన్నడ, మళయాళ భాషల్లో అజిత్ సినిమా అందుబాటులో ఉంటుంది అని కన్ఫర్మ్ చేయగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు దీనిని కన్ఫర్మ్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు