అఫీషియల్ : “కల్కి” నుంచి వచ్చే అప్డేట్ ఇదే.. కానీ

అఫీషియల్ : “కల్కి” నుంచి వచ్చే అప్డేట్ ఇదే.. కానీ

Published on Apr 21, 2024 2:00 PM IST

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ప్రపంచ స్థాయి చిత్రం “కల్కి 2898ఎడి” కూడా ఒకటి. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ పై ఎట్టకేలకి చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మేకర్స్ ఈరోజు ఎక్స్ క్లూజివ్ గా ఐపీఎల్ మ్యానియాతో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ ద్వారా ఓ అప్డేట్ ని అందిస్తున్నట్టుగా నిన్న అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మరి ఇప్పుడు ఈ అప్డేట్ ఏంటి అనేది రివీల్ చేశారు. స్టార్ స్పోర్ట్స్ వారు అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్ ని అయితే ఈ సాయంత్రం గుజరాత్, పంజాబ్ కింగ్ మ్యాచ్ లో రివీల్ చేస్తున్నట్టుగా ఇప్పుడు ప్రకటించారు. దీనితో ఈ సాయంత్రం ఏడుంపావు కి కల్కి నుంచి ఈ అప్డేట్ రానుంది. కానీ చాలా మంది సినిమా రిలీజ్ డేట్ కూడా ఇందులోనే క్లారిటీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు.

కానీ దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి అప్డేట్ ని మేకర్స్ అందించలేదు. సో ఈ సస్పెన్స్ కి తెర పడాలి అంటే ఈ సాయంత్రం వరకు ఆగాల్సిందే. ఇక ఈ భారీ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకోణ్ అకాగే దిశా పటాని తదితరులు నటిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే వైజయంతి మూవీస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు