పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్లో మొదటిసారిగా ఒక సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నారు, అదే ‘ఓజీ 2’ (OG 2). ఈ సినిమాకు కూడా సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. మొదటి భాగం సృష్టించిన ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఐతే, సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, ఈ సీక్వెల్ కి సంబంధించిన ఏదైనా ప్రత్యేక అప్డేట్ వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఏదో ఆసక్తికరమైన విషయం ప్లాన్ చేస్తున్నట్లు తమన్ ఇప్పటికే పలుమార్లు సంకేతాలు ఇచ్చారు. దీనికితోడు పవన్ పుట్టినరోజు కానుకగా ఒక యానిమేటెడ్ వీడియోను విడుదల చేయవచ్చని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, చిత్ర బృందం అసలు ఏం ప్లాన్ చేసిందనేది ఇంకా వెల్లడించలేదు, దీంతో అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తూనే అధికారిక ప్రకటన కోసం వేచి ఉన్నారు. ఈ సీక్వెల్ ను ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ నిర్మిస్తుండగా, మిగిలిన నటీనటులు మరియు సాంకేతిక బృందానికి సంబంధించిన వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.
