‘ఓజి’ : ఆ విషయమై కూడా ప్రత్యేక శ్రద్ద ?

‘ఓజి’ : ఆ విషయమై కూడా ప్రత్యేక శ్రద్ద ?

Published on Feb 23, 2024 3:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా తన జనసేన పార్టీ కార్యకలాపాల్లో బిజీగా ఉన్నారు. ఇక మరోవైపు ఆయన మొత్తం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సుజీత్ తెరకెక్కిస్తున్న భారీ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ ఓజి. ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుజీత్ తెరకెక్కిస్తుండగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీని సెప్టెంబర్ 27న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. విషయం ఏమిటంటే, ఈ మూవీకి సంగీతం అందిస్తున్న థమన్ సాంగ్స్ తో పాటు బీజీఎమ్ వర్క్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. ముఖ్యంగా గతంలో పవన్ తో చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీస్ ని మించేలా ఈ స్క్రిప్ట్ కి తగ్గట్లు థమన్ ఇస్తున్న బీజీఎమ్ ఓజి మూవీకి పెద్ద ప్లస్ అవుతుందని, ఆ విధంగా దర్శకుడు సుజీత్ అటు పవన్ పవర్ఫుల్ క్యారెక్టర్ తో పాటు సాంగ్స్, బీజీఎమ్ విషయమై కూడా మంచి అవుట్ పుట్ రాబట్టేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు