‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ !

‘గుంటూరు కారం’ నుంచి ‘ఓ మై బేబీ’ !

Published on Dec 11, 2023 11:53 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలోని ‘ఓ మై బేబీ’ పాట ప్రోమో ఈరోజు సాయంత్రం 4:05 గంటలకు విడుదల కానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని 2వ సింగిల్ పూర్తి పాట డిసెంబర్ 13న విడుదల కానుంది. మొత్తానికి సూపర్ స్టార్ అభిమానులందరికీ ఇది ఖచ్చితంగా సంతోషకరమైన వార్త. ఇక ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జ‌న‌వ‌రి 12, 2024న రిలీజ్ కానుంది.

గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో త్రివిక్రమ్ ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. హారిక & హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతుంది. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు