సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు చెప్పగానే మన మదిలో కొన్ని అద్భుతమైన సినిమాలు మెదిలే దర్శకులు చాలా తక్కువ మండే ఉన్నారు. అలాంటి దర్శకులలో ముందుండే డైరెక్టర్ మణిరత్నం. మణిరత్నం లేటెస్ట్ మ్యాజికల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘ఓకే బంగారం’. ఓకే బంగారం సినిమా ఒకే సారి తెలుగు తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకి మొదటి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సినిమాలో కథ పెద్దగా లేకపోయినా మణిరత్నం చేసిన మేజిక్ మాత్రం వర్క్ అవుట్ అవ్వడంతో బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తోంది.
ఒక్క ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడులోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి సూపర్బ్ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో కలిపి 3.27 కోట్ల షెడ్ సాధించింది. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మించాడు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
ఓకే బంగారం అండ్ ఓకే కన్మణి యుఎస్ కలెక్షన్స్ రిపోర్ట్ :
| వారం | తెలుగు (ఓకే బంగారం) | తమిళం (ఓకే కన్మణి) |
|---|---|---|
| గురువారం ప్రీమియర్స్ |
$ 12,398 | $ 49,324 |
| శుక్రవారం |
$ 60,923 | $ 126,471 |
| శనివారం |
$ 100,533 | $ 173,418 |
| మొత్తం |
$ 173,894 (1.09Cr) | $ 349,213 (2.18Cr) |


