సౌత్ ఇండియన్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన మణిరత్నం ప్రస్తుతం ‘ఓకే బంగారం’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. మలయాళ నటుడు మమ్ముట్టి వారసుడు, ప్రెజెంట్ మలయాళంలో ట్రెండ్ సెట్ చేస్తున్న యంగ్ హీరో దల్క్వేర్ సల్మాన్, కేరళ కుట్టి నిత్యా మీనన్ జంటగా నటించారు. తమిళంలో ‘ఓకే కన్మణి’ గా తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో ‘ఓకే బంగారం’గా రిలీజ్ చేస్తున్నారని ఇది వరకే తెలియజేశాం. తాజాగా ఈ సినిమాని ఏప్రిల్ 14అ రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. తెలుగు మరియు తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.
ఒకే బంగారం ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీ అని, ఈ సినిమాలో క్యారెక్టర్లు ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాయని ఈ చిత్ర టీం అంటున్నారు. మణిరత్నం కెరీర్లో అత్యంత వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సినిమాగా ‘ఓకే బంగారం’ రికార్డులకు ఎక్కింది. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థ వారు తెలుగులో ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు.
