శిల్పారామంలో హాలీవుడ్‌ హీరోయిన్ ఒలీవియా !

Olivia

క్రేజీ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్‌ నటిస్తోంది. అయితే, ఈ భామకు షూటింగ్ లేకపోవడంతో హైదరాబాద్‌ వీధుల్లో తిరుగుతూ సిటీ అందాలను ఆస్వాదిస్తూ కనిపిచింది. ఆమెతో పాటు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ గా పని చేస్తోన్న అనురెడ్డి కూడా ఉన్నారు. ఒలీవియా మోరీస్‌ – అనురెడ్డి కలిసి శిల్పారామం వెళ్లారు.

కాగా శిల్పారామంలోని ప్రకృతి అందాలను, అక్కడ ఉన్న హస్తకళల విద్యను చూసి ఒలీవియా మోరీస్‌ థ్రిల్ ఫీల్ అయింది. ఇక ప్రస్తుతం ఒలీవియా మోరీస్‌ హైదరాబాద్‌ వీధుల్లో తిరిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో ‘ఎన్టీఆర్ – రామ్ చరణ్’ హీరోలుగా నటిస్తున్నారు.

దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్యాన్‌ ఇండియా మూవీలో అజయ్ దేవగన్, సముద్రఖని, శ్రీయా అలాగే విదేశీ నటీనటులు కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version