3 రోజుల్లో 17 కోట్లతో “ఓం భీమ్ బుష్”

3 రోజుల్లో 17 కోట్లతో “ఓం భీమ్ బుష్”

Published on Mar 25, 2024 12:00 PM IST

హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush). గత శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతుంది. ఈ చిత్రం 3 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 17 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లను సాధించింది. ఈ వసూళ్ల వివరాలను మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

టీజర్ మరియు థియేట్రికల్ ట్రైలర్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం తో సినిమా పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు