అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ వైపు “ఓం భీమ్ బుష్”

అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ వైపు “ఓం భీమ్ బుష్”

Published on Mar 27, 2024 10:35 AM IST

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, బలగం ఫేమ్ ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం లో తెరకెక్కిన హారర్ కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush). ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ వీకెండ్ కి సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, క్లీన్ హిట్ కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూఎస్ ప్రాంతంలో కూడా ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది.

ఈ చిత్రం 400కే డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హాఫ్ మిలియన్ మార్క్ కి చేరువలో ఉంది. డిఫెరెంట్ కాన్సెప్ట్స్ తో, డిఫెరెంట్ స్క్రిప్ట్స్ తో శ్రీ విష్ణు చేస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచిగా పర్ఫాం చేస్తున్నాయి. ఈ చిత్రం లో శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, అయేషా ఖాన్, ప్రీతి ముకుందన్ లు కీలక పాత్రల్లో నటించగా, సన్నీ ఎంఆర్ సంగీతం అందించారు. లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు