ఓటిటి: టాప్ లో ట్రెండ్ అవుతోన్న “ఓం భీమ్ బుష్”

ఓటిటి: టాప్ లో ట్రెండ్ అవుతోన్న “ఓం భీమ్ బుష్”

Published on Apr 15, 2024 2:19 PM IST


టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన కామెడీ ఎంటర్టైనర్ ఓం భీమ్ బుష్ (Om Bheem bush) ఇటీవల థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టడం జరిగింది. డిజిటల్ ప్రీమియర్ గా ఈ చిత్రం ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియో లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రానికి ఓటిటి లో కూడా మంచి రెస్పాన్స్ రావడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ల పెర్ఫార్మెన్స్ ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్, మనీష్ కుమార్ మరియు రచ్చ రవి లు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు