నూతన “రామాయణం”.. ఈ విషయంలో ఓం రౌత్ గ్రేట్

నూతన “రామాయణం”.. ఈ విషయంలో ఓం రౌత్ గ్రేట్

Published on Apr 28, 2024 12:02 PM IST

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా తెరకెక్కిస్తున్న పలు భారీ చిత్రాల్లో సూపర్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) అలాగే సాయి పల్లవి (Sai Pallavi) కలయికలో దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న చిత్రం “రామాయణం” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఉంటుంది అనే టాక్ వచ్చినప్పుడు నుంచీ అప్పటికే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చిత్రం “ఆదిపురుష్” తో పోలుస్తూ చాలానే స్టార్ట్ అయ్యాయి.

అయితే తర్వాత ఆదిపురుష్ వచ్చి ప్రభాస్ కెరీర్ లో భారీ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ అనుకున్న రేంజ్ హిట్ అవ్వలేదు. ఇక తర్వాత దర్శకుడు ఓం రౌత్ పైనే విమర్శలు గట్టిగా వచ్చాయి. అయితే ఆదిపురుష్ ని మించి ప్రొజెక్ట్ చేస్తున్న నూతన రామాయణం విషయంలో మరో సారి ఆదిపురుష్ ని గుర్తు చేసుకోవాలి.

నితీష్ తివారి రామాయణం షూటింగ్ మొదలై కొన్ని రోజులే అయ్యింది. కానీ ఈ లోపలే ఊహించని విధంగా హీరో హీరోయిన్స్ ఫోటోలు అది కూడా సెట్స్ నుంచే బయటకి వచ్చేసాయి. కానీ ఆదిపురుష్ విషయంలో మాత్రం సినిమా స్టార్ట్ అయ్యి రిలీజ్ అయ్యిన వరకు కూడా మేకర్స్ అధికారికంగా వదిలిన ఫోటోలు తప్ప షూటింగ్ స్పాట్ నుంచి అసలు లీక్ అయ్యిన దాఖలాలు కూడా లేవు.

ఇలా సినిమాని జాగ్రత్తగా కాపాడుకోవడం విషయంలో మాత్రం ఓం రౌత్ గ్రేట్ అనే చెప్పాలి. కాకపోతే ఏమిటంటే ఆ తీసిన సినిమా ఏదో హిట్ కూడా అయ్యేలా ప్లాన్ చేసి ఉంటే కనీసం ఫ్యాన్స్ ఆగ్రహం నుంచి అయినా తప్పించుకునేవాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు