“ఆదిపురుష్”పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ డీటైల్స్.!

“ఆదిపురుష్”పై దర్శకుడు ఇంట్రెస్టింగ్ డీటైల్స్.!

Published on Feb 24, 2021 11:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న పలు భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాలు తీస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వాటిలో ఒక్కొక్కటి ఒక్కో భాషలో తెరకెక్కుతున్నవి కూడా ఉన్నాయి. అలా హిందీ మెరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా దర్శకుడు ఓంరౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ప్రభాస్ రామునిగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంపై ఓంరౌత్ కొన్ని ఇంట్రెస్టింగ్ డీటైల్స్ ను బయటపెట్టినట్టు తెలుస్తుంది. ఇలాంటి సబ్జెక్టు ను చెయ్యడం చాలా టఫ్ పని అని, అలాగే ప్రపంచంలోని హాఫ్ బిలియన్ ప్రేక్షకులకు తనకి చాలా ముఖ్యమైనదని అంతే కాకుండా ఇందులోని ఒక్కో పాత్రలోని భిన్నమైన కోణాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకుంటారని కూడా తెలిపారు.

అలాగే ఆ మధ్య సైఫ్ చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పై కూడా స్పందించారు. ఆ మ్యాటర్ అప్పటితోనే ముగిసిపోయింది అని ఒక విషయం ఇంకొకలా ప్రొజెక్ట్ అయ్యిందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. మరి ఈ చిత్రానికి గాను భారీ విజువల్ ఎఫెక్ట్స్ ను ప్లాన్ చేస్తుండగా ప్రపంచ వ్యాప్తంగా ఆగష్టు 8న 2022కి విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు