‘అల వైకుంఠపురములో’.. డాడీ ఫుల్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్ !

‘అల వైకుంఠపురములో’.. డాడీ ఫుల్ సాంగ్ రిలీజ్ కి టైం ఫిక్స్ !

Published on Nov 20, 2019 10:44 PM IST

‘అల వైకుంఠపురములో’ ఇప్పటికే స్పెషల్ సర్ ప్రైజ్ గా మూడో సాంగ్ ‘ఓ మై గాడ్ డాడీ…’ సాంగ్ టీజర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఈ సాంగ్ టీజర్ లో బన్నీ కుమారుడు అయాన్, కుమార్తె అహాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ ఫోటోను చూస్తూ వాళ్ళు ఫన్నీగా తల బాదుకోవడం, అలాగే చివర్లో అయాన్ వేసిన స్టెప్ కూడా సాంగ్ టీజర్ కి హైలెట్ గా నిలిచింది. అయితే తాజాగా ‘ఓ మై గాడ్ డాడీ…’ ఫుల్ సాంగ్ ను నవంబర్ 22న సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు విడుదల చేయబోతున్నట్లు.. చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ను విడుదల చేసింది.

కాగా 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక బన్నీ – త్రివిక్రమ్ పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. క ఈ సినిమలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు