“ఆదిపురుష్” మాయా ప్రపంచాన్ని మొదలు పెట్టిన ఓంరౌత్.!

“ఆదిపురుష్” మాయా ప్రపంచాన్ని మొదలు పెట్టిన ఓంరౌత్.!

Published on Jan 19, 2021 8:00 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న పలు ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ లలో “ఆదిపురుష్” కూడా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ భారీ ఇతిహాస చిత్రంపై కనీ వినీ ఎరుగని రీతి అంచనాలు నెలకొన్నాయి. మరి రామాయణ ఇతిహాస ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరామునిగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని నెవర్ బిఫోర్ విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు.

మరి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ ఈ చిత్రంలోని కేవలం గ్రాఫిక్స్ కోసమే పెద్ద ఎత్తున ఖర్చు చెయ్యడానికి రెడీ అయ్యారు. అయితే ఈ చిత్రానికి గాను విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం చాలా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఆ మాయా ప్రపంచాన్ని సృష్టించడం ఈరోజు నుంచే మొదలు పెట్టినట్టుగా దర్శకుడు ఓంరౌత్ తెలిపారు.

తన మోషన్ క్యాప్చర్ టీం తో ఆదిపురుష్ లోని విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి పనులు ప్రారంభించేసారు. 3డి టెక్నలాజిలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, కృష్ణన్ కుమార్, ఓం రౌత్ లు సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. మరి అలాగే ఈ భారీ విజువల్ వండర్ ను వచ్చే ఏడాది ఆగష్టు 11న ప్రపంచ వ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు