
దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ జంటగా రొమాంటిక్ సినిమాల స్పెషలిస్ట్ మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘ఒకే కన్మణి’. మార్చి 1న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత మణిరత్నం ఓ ప్రేమకథను తెరకెక్కించడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. వీటికి తోడు సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్ తన ట్వీట్లతో ప్రేక్షకులలో మరింత ఆసక్తి కలిగిస్తున్నారు.
ఈ ట్రెండ్ సెట్టింగ్ లవ్ స్టొరీని ‘ఒకే బంగారం’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగు వెర్షన్ ను నిర్మించారు. ప్రకాష్ రాజ్, కనిక కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.