మరోసారి “ధమాకా” కాంబినేషన్..

మరోసారి “ధమాకా” కాంబినేషన్..

Published on May 27, 2024 4:00 PM IST

మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇప్పుడు పలు ఆసక్తికర చిత్రాలు చేస్తుండగా తాను సాలిడ్ కం బ్యాక్ హిట్ అందుకున్న చిత్రాల్లో దర్శకుడు త్రినాథరావు నక్కినతో చేసిన సాలిడ్ హిట్ చిత్రం “ధమాకా” కూడా ఒకటి. మరి ఈ చిత్రంతో యంగ్ హీరోయిన్ శ్రీలీల కూడా టాలీవుడ్ లో ఒక్కసారిగా సెన్సేషన్ గా నిలిచింది.

అంతే కాకుండా ఈ సినిమాతో మోస్ట్ ఎనర్జిటిక్ పెయిర్ గా రవితేజ శ్రీలీల కూడా మారారు. ఇక మళ్ళీ ఇన్ని సినిమాల గ్యాప్ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ రిపీట్ కానున్నట్టుగా ఇపుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. రవితేజ కెరీర్ బెంచ్ మార్క్ చిత్రం 75వ ప్రాజెక్ట్ కి ఈమె లాక్ అయినట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని భాను బోగవరపు ఒక పక్కా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తుండగా ఈ జూన్ నుంచే సినిమా షూటింగ్ మొదలు పెట్టుకోనున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తుండగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు