మహేష్ ఫ్యాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్

మహేష్ ఫ్యాన్స్ కి మరోసారి డిజప్పాయింట్మెంట్

Published on Apr 25, 2024 5:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా శ్రీలీల హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన లేటెస్ట్ మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “గుంటూరు కారం”. మరి మహేష్ బాబు కెరీర్ లో మరో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్ ఇచ్చిన ఆల్బమ్ మంచి హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. మరి ఈ ఆల్బమ్ లో ఉన్న సాంగ్ సినిమాలో లేని సాంగ్ 7వ సాంగ్ కోసం ఎప్పుడు నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు.

అయితే తాజాగా థమన్ ఇచ్చిన ఓ మిరపకాయ్ హింట్ తో ఖచ్చితంగా ఇది గుంటూరు కారం 7వ పాట కోసమే అని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ ఇది సాంగ్ కోసం కాదు తన మ్యూజికల్ స్పైస్ టూర్ అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దీనితో గుంటూరు కారం ట్రీట్ ని ఆశించిన ఫ్యాన్స్ అందరికీ చివరికి నిరాశే మిగిలింది. మరి ఈ అవైటెడ్ సాంగ్ ని థమన్ ఎప్పుడు వదులుతాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు