“పుష్ప 2” లో మరోసారి ఇండియాని షేక్ చేసే సాంగ్..!

“పుష్ప 2” లో మరోసారి ఇండియాని షేక్ చేసే సాంగ్..!

Published on Nov 30, 2023 7:04 AM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2”. మరి హడావుడి లేకుండా ప్లానింగ్ ప్రకారం రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాలో చాలానే సర్ప్రైజ్ లు ప్లాన్ చేసారు. అయితే ఫస్ట్ పార్ట్ లో దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన పాటలు కానీ వాటికి బన్నీ వేసిన హుక్ స్టెప్స్ లని ఏ లెవెల్ రీచ్ సొంతం చేసుకున్నాయో తెలిసిందే.

మరి ఆ సాంగ్స్ లో శ్రీవల్లి కూడా ఒకటి. అయితే ఈ సాంగ్ కి వర్క్ చేసిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ పార్ట్ 2 లో కూడా ఓ సాంగ్ చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. తాను రీసెంట్ గా సుకుమార్ ని కలవడంపై పోస్ట్ పెట్టిన జానీ మాస్టర్ లాస్ట్ లో తమ సాంగ్ కోసం కూడా వైట్ చెయ్యండి అంటూ కన్ఫర్మ్ చేసాడు. దీనితో పుష్ప 2 లో కూడా క్రేజీ సాంగ్ ఉందని అర్ధం అయిపోయింది. మరి దీనితో వీరు మళ్లీ ఇండియాని తమ హుక్ స్టెప్ తో షేక్ చేస్తారేమో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు