మరోసారి ఉదారత చాటుకున్న మెగాస్టార్.. ప్రముఖ జర్నలిస్ట్ కి సాయం

మరోసారి ఉదారత చాటుకున్న మెగాస్టార్.. ప్రముఖ జర్నలిస్ట్ కి సాయం

Published on May 28, 2024 8:00 AM IST

మన తెలుగు సినిమా దిగ్గజ నటుడు అభిమానులకి “అన్నయ్య”, సాయం కోరిన వారికి “ఆపద్బాంధవుడు” అయినటువంటి మెగాస్టార్ ని ఒక హీరోగానే కాకుండా ఒక వ్యక్తిగా కూడా ఎంతో మంది ఆరాధిస్తారు. ఇప్పుడు వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మెగాస్టార్ వాటిని ఇంకా కొనసాగిస్తూనే వెళ్తున్నారు. సాయం అని వస్తే తెలుగా, తమిళా అని చూడని చిరు తాజాగా అందించిన మరో సాయం విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.

టాలీవుడ్ లో ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ అయినటువంటి ప్రభు కి సాయం అందించారు. ఆయన జెనరల్ మెడికల్ చెకప్ చేయించుకోగా తనకి గుండెలో 80 శాతం బ్లాకులు ఉన్నాయని తెలిసిందట. దీనితో చిరంజీవి గారిని సంప్రదించగా తాను స్టార్ హాస్పిటల్ కి కాల్ చేసి ప్రతి చిన్న అంశం అరేంజ్ చేయించి పైసా ఖర్చు ప్రభు సైడ్ నుంచి అవ్వనివ్వకుండా ఎలాంటి బైపాస్ సర్జరీ లేకుండా స్టంట్స్ తో ప్రభు ప్రాణాలు కాపాడిన వారు అయ్యారు.

ఇప్పుడు అయన ఆరోగ్యం బాగానే ఉందట. అయితే ఆలస్యం కాకుండా ముందే పసిగట్టడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు. మరి ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి చూపిన చొరవతో తెలుగు సినిమా ఫిల్మ్ జర్నలిస్ట్ వారు అంతా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. దీనితో మెగాస్టార్ అభిమానులు తమ హీరో విషయంలో మరోసారి గర్వంగా ఫీలవుతుండగా మెగాస్టార్ చేసిన ఈ కనిపించని మరో సాయం వార్త వైరల్ గా నిలిచింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు