మరోసారి వాయిదా పడిన ‘రన్ రాజా రన్’

మరోసారి వాయిదా పడిన ‘రన్ రాజా రన్’

Published on Jul 15, 2014 12:41 PM IST

run-raja-run
కమర్షియల్ సినిమాలకు భిన్నంగా సినిమాలు చేసి పేరుతెచ్చుకున్న శర్వానంద్ హీరోగా నటించిన సినిమా ‘రన్ రాజా రన్’. ప్రస్తుతం ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాని జూలై 11న రిలీజ్ అన్నారు, ఆ తర్వాత జూలై 18 అన్నారు కానీ ఈ వారం కూడా ఈ సినిమా విడుదల కానుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని ఆగష్టు 1న రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. చిన్న చిన్న పోస్ట్ ప్రొడక్షన్ పనులు బాలన్స్ ఉండడం వల్లే వాయిదా పడుతోందని ఈ చిత్ర అంటున్నారు.

గతంలో ‘మిర్చి’ సినిమాని నిర్మించిన యువి క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ – ప్రమోద్ లు ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉంటూనే సర్ప్రైజింగ్ గా కూడా సాగుతుందని’ చిత్ర నిర్మాతలు అంటున్నారు. సుజీత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాని ఎక్కువభాగం హైదరాబాద్, గోవాలలో షూట్ చేసారు. శర్వానంద్ స్టైలిష్ లుక్ లో మొబైల్స్ దొంగగా కనిపించనున్న ఈ సినిమాతో సీరత్ కపూర్ హీరోయిన్ గా పరిచయం కానుంది. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి మధి సినిమాటోగ్రాఫర్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు