‘నిన్ను చూసే ఆనందంలో’ వన్ మిలియన్ వ్యూస్ !

‘నిన్ను చూసే ఆనందంలో’ వన్ మిలియన్ వ్యూస్ !

Published on Sep 3, 2019 9:39 PM IST

a

నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌ లో మైత్రి మూవీ మేకర్స్‌ పతాకం పై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్న విభిన్న చిత్రం ‘నాని’స్‌ గ్యాంగ్‌ లీడర్‌’. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేస్తోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పోస్టర్లతో పాటుగా టీజర్ ట్రైలర్లకు కూడా విశేష స్పందన వచ్చింది. అలాగే ఈ సినిమాకి నుండి వచ్చిన ‘నిన్ను చూసే ఆనందంలో’ లిరికల్ సాంగ్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ సాంగ్ వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా సిడ్ శ్రీరామ్ ఆలపించారు.

ఇక ఈ సాంగ్ కు అనిరుధ్ అందించిన ట్యూన్.. ఇన్స్ట్రుమెంటేషన్ కొత్తగా ఉన్నాయి. ఈ చిత్రంలో యంగ్ హీరో కార్తికేయ ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సినిమాలో నాని, కార్తికేయలతో చేసిన యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయట. లక్ష్మీ, శరణ్య, ప్రియాంక తదితరులతో కూడిన గ్యాంగ్‌ తో నాని చేసిన సీన్స్‌ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌ గా ఉంటాయని తెలుస్తోంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు