కుర్చీ మడతపెట్టి పాటకి 1 మిలియన్ రీల్స్!

కుర్చీ మడతపెట్టి పాటకి 1 మిలియన్ రీల్స్!

Published on Jan 24, 2024 2:32 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించడం జరిగింది.

ఈ చిత్రం లోని కుర్చీ మడతపెట్టి పాటకి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ పాటకి వన్ మిలియన్ కి పైగా రీల్స్ వచ్చాయి. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. ఈ పాటకి అద్దిరిపోయే స్టెప్పులు వేస్తూ వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్. మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు