బుట్ట బొమ్మా సాంగ్ సక్సెస్ ని షేర్ చేసుకున్న థమన్.

Published on May 27, 2020 9:14 am IST

అల వైకుంఠపురంలో మూవీ కొరకు థమన్ ఇచ్చిన మ్యూజిక్ ఆ మూవీ విజయంలో కీలక పాత్ర పోషించింది . ముఖ్యంగా బుట్ట బొమ్మా…, మరియు రాములో రాములా సాంగ్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. ఇక యూట్యూబ్ లో ఈ సాంగ్స్ సంచలనాల గురించిన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వందల మిలియన్స్ వ్యూస్ ఈ పాటలకు దక్కింది. కాగా బుట్ట బొమ్మా సాంగ్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నట్లు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా అత్యంత ప్రాచుర్యం పొందిన సాంగ్ వీడియోలలో ఈ పాట 15వ స్థానంలో నిలిచింది. దీనిపై ఓ ఇంగ్లీష్ డైలీ ప్రముఖంగా రాయగా, థమన్ ట్విట్టర్ వేదికగా ఆ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.

బన్నీ, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . బన్నీ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్న ఈ మూవీ నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో మురళీ శర్మ, జయరామ్ కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప మూవీ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More