“పుష్ప 2”: ఒక్క సాంగ్.. 6 భాషలు ఒకే సింగర్

“పుష్ప 2”: ఒక్క సాంగ్.. 6 భాషలు ఒకే సింగర్

Published on May 27, 2024 7:00 PM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు (Allu Arjun) అర్జున్ హీరోగా రష్మికా మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం పాన్ ఇండియా సినిమా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ చిత్రం నుంచి ఆల్రెడీ వచ్చిన ఫస్ట్ సింగిల్ క్రేజీ హిట్ గా నిలిచి చార్ట్ బస్టర్ అయ్యింది.

మరి ఈ తర్వాత ఓ కపుల్ సాంగ్ రష్మిక, అల్లు అర్జున్ పై రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇది కూడా పార్ట్ లో సామి సాంగ్ తరహాలోనే సాలిడ్ డ్యూయెట్ గా ఉండనుండగా హీరోయిన్ సైడ్ నుంచి ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ స్పెషల్ సాంగ్ కోసం దేవిశ్రీ ప్రసాద్ స్పెషల్ ప్లానింగ్ నే చేసాడు. ఇక ఈ ఒక్క సాంగ్ ని మొత్తం ఆరు భాషల్లో కూడా కేవలం ఒకే సింగర్ తో పాడించడం విశేషం.

మరి ఈ సాంగ్ కోసం ఎంతోమంది ఫెవరెట్ వాయిస్ అయ్యిన శ్రేయా గోషాల్ (Shreya Ghoshal) ని దింపగా ఆమె మొత్తం 6 భాషల్లో సాంగ్ ని ఆలపించినట్టుగా తెలియజేసారు. అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ, హిందీ సహా బెంగాలీ ఈ అన్ని భాషల్లో కూడా ఆమెనే ఈ ఒక్క సాంగ్ ని పాడారు. మరి ఈ మే 29న రానున్న సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు