‘వకీల్ సాబ్’ ఆల్మోస్ట్ పూర్టైనట్టే

‘వకీల్ సాబ్’ ఆల్మోస్ట్ పూర్టైనట్టే

Published on Mar 10, 2020 8:49 PM IST

Vakeel Saab

పవన్ మునుపెన్నడూ లేని విధంగా సినిమాలు చేస్తున్నారు. ఇంతకుముందు ఒక సినిమా కోసం కనీసం ఆరేడు నెలలు వెచ్చించే పవన్ ‘వకీల్ సాబ్’ చిత్రాన్ని మాత్రం చాలా వేగంగా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే 80 శాతం టాకీ పార్ట్, ఫైట్స్ పూర్తిచేసేశారు. ఇక మిగిలిందల్లా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, ఒక ఫైట్ మాత్రమే. ఈ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్లో పవన్ సరసన శృటిహాసన్ నటిస్తుందని వార్తలు వచ్చినా ఇంకా ఫైనల్ కాలేదు.

ఒకసారి హీరోయిన్ ఎవరనేది ఖరారైతే ఆ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్, మిగిలిన ఒక ఫైట్ ఒకే షెడ్యూల్లో కానిచ్చేస్తారట. మొత్తానికి పవన్ రెండు నెలల్లోనే సినిమా కంప్లీట్ చేయనున్నారు. ఇక ప్రస్తుతం క్రిష్ చిత్రం షూటింగ్లో ఉన్న పవన్ ఆ చిత్రాన్ని కూడా ‘వకీల్ సాబ్’ తరహాలోనే వేగంగా కంప్లీట్ చేసేలా పనిచేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తే 2020, 2021 కలిపి పవన్ నుండి నాలుగు సినిమాలు విడుదలయ్యేలా ఉన్నాయి.

తాజా వార్తలు