మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆచార్య’లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. వీరిద్దరికీ కథలో సాలిడ్ ట్రాక్ ఉంటుంది. వీరిపై సినిమాలో రెండు పాటలు ఉంటాయట. ఇప్పటికే ‘నీలాంబరి’ అనే మాంటేజ్ పాటను పూర్తిచేశారు కొరటాల శివ. రంపచోడవరం అడవుల్లో ఈ పాటను తెరకెక్కించారు. ఇంకొక సాంగ్ మిగిలుంది. ఈ పాటను ఏప్రిల్ 9వ తేదీ నుండి షూట్ స్టార్ట్ చేయనున్నారు.
సినిమా కోసం ప్రధానమైన ధర్మస్థలి విలేజ్ సెట్లోనే ఈ పాటను షూట్ చేయనున్నారు. ఈ పాట పూర్తైతే సినిమాలో చరణ్, పూజాల ట్రాక్ ముగిసినట్టే. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో చిరు సరసన ప్రధాన కథానాయకిగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. సినిమాను వేసవి కానుకగా మే 13వ తేదీన ప్రేక్షకులకు అందివ్వాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.


