‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కేవలం మూడు పాటలేనట

Published on Sep 17, 2019 2:48 pm IST

‘బాహుబలి’ తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. దానికి తోడు సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. ప్రధాన భాషలన్నిటిలోనూ చిత్రం విడుదలకానుంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో కేవలం మూడు పాటలు మాత్రమే ఉంటాయట.

అలాగే ఇంకొక పాట నేపథ్య సంగీతంతో పాటు పలు సన్నివేశాల్లో వినబడుతుందట. చిత్రం అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లాంటి స్వాతంత్ర్య యోధుల కథలతో కూడుకున్నది కావడంతో రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో ఆరు పాటలు అనే ఫార్ములాను పక్కన పెట్టి ఉండవచ్చు జక్కన్న.

రూ.400 కోట్ల వ్యయంతో డివివి. దానయ్య ఈ చిత్రాన్ని న్నిర్మిస్తున్నారు. ఇటీవలే బల్గేరియా షెడ్యూల్ పూర్తికాగా త్వరలోనే హైదరాబాద్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు.

సంబంధిత సమాచారం :

X
More