”ఓ పిట్ట కథ” టీజర్ కి సూపర్ రెస్పాన్స్

Published on Feb 8, 2020 10:52 pm IST

అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న క్యూట్ ఫిల్మ్ “ఓ పిట్ట కథ” . చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సీనియర్ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్నారు. , కేరింత, మనమంతా తదితర చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న విశ్వంత్ దుద్దుంపూడి ఈ చిత్రంలో మరో హీరో. నిత్యాశెట్టి కథానాయిక .

ఈ సినిమా టీజ‌ర్‌ను సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. ఈ టీజర్ ఎప్పుడూ యూట్యూబ్ లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది. ఓ పాప‌కు తండ్రి క‌థ చెప్పాల‌నుకుంటే.. ఆ పాపే తండ్రి క‌థ చెప్ప‌డంతో టీజ‌ర్ స్టార్ట్ అయ్యింది.అంద‌మైన ప‌ల్లెటూళ్లో అంద‌మైన వెంక‌ట ల‌క్ష్మి ఉండేది. అదే ఊళ్లో ఉంటున్న ప్ర‌భుకి వెంక‌ట ల‌క్ష్మి అంటే చిన్న‌ప్ప‌ట్నుంచి చాలా ఇష్టం. అదే స‌మయంలో వెంక‌ట‌ల‌క్ష్మి వాళ్లింటికి క్రిష్ అనే మ‌రో యువ‌కుడు వ‌స్తాడు. అత‌ను కూడా వెంకట ల‌క్ష్మిని ఇష్ట‌ప‌డ‌తాడు. అదే స‌మ‌యంలో క‌థ‌లో అనుకోని మ‌లుపు తిరుగుతుంది. వెంక‌ట‌ల‌క్ష్మిని ఎవ‌రో కిడ్నాప్ చేస్తారు. మ‌రి ఆమెను ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అని తెలుసుకోవాలంటే మార్చి 6న విడుదలైయ్యే సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శ‌క నిర్మాత‌లు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :