“ఊరు పేరు భైరవకోన” 10 రోజుల వసూళ్లు ఇవే!

“ఊరు పేరు భైరవకోన” 10 రోజుల వసూళ్లు ఇవే!

Published on Feb 26, 2024 5:00 PM IST

సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించిన ఊరు పేరు భైరవకోన చిత్రం ఫిబ్రవరి 16, 2024 న థియేటర్ల లో రిలీజ్ అయ్యింది. మల్టిపుల్‌ జానర్‌ల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రానికి వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహించారు. వర్షా బొల్లమ్మ, కావ్యా థాపర్‌ ఇందులో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం కి సంబందించిన లేటెస్ట్ వసూళ్ల వివరాలను మేకర్స్ తాజాగా ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమా 10 రోజుల్లో మొత్తం 25.11 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం జరిగింది.

మేకర్స్ విడుదలకు రెండు రోజుల ముందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక ప్రీమియర్‌లను షెడ్యూల్ చేసారు మరియు ఈ కలెక్షన్లు ప్రీమియర్‌లను కలుపుకొని ఉన్నాయి. వైవా హర్ష, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా చిత్రాన్ని నిర్మించారు. భాను భోగవరపు కథ అందించగా శేఖర్ చంద్ర బాణీలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు