థ్రిల్లింగ్ గా “ఊరు పేరు భైరవకోన” ట్రైలర్.!

థ్రిల్లింగ్ గా “ఊరు పేరు భైరవకోన” ట్రైలర్.!

Published on Jan 18, 2024 11:49 AM IST


యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా యంగ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా మన టాలీవుడ్ క్రియేటివ్ ఫిల్మ్ మేకర్స్ లో ఒకరైన దర్శకుడ్ వి ఐ ఆనంద్ తెరకెక్కించిన సాలిడ్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “ఊరు పేరు భైరవకోన”. మరి మొదటి నుంచి కూడా ఈ సినిమా పట్ల ఆడియెన్స్ లో మంచి ఆసక్తి నెలకొనగా ఈ సినిమా నుంచి ఫైనల్ గా అవైటెడ్ ట్రైలర్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేసారు.

మరి ఈ ట్రైలర్ కూడా అంచనాలు రీచ్ అయ్యే విధంగా మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉందని చెప్పాలి. గరుడ పురాణంలో మాయమైన నాలుగు పేజీల మిస్టరీనే ఈ భైరవ కోన అంటూ మంచి సస్పెన్స్ ని స్టార్ట్ చేసిన ఈ ట్రైలర్ లో మరిన్ని ఆసక్తికర డైలాగ్స్ ఉన్నాయి.

అలాగే సందీప్ పై కనిపిస్తున్న కొన్ని ఫాంటసీ సీక్వెన్స్ లు అయితే ఈ తరహా సినిమాల కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి ట్రీట్ ని ఇచ్చేలా ఉన్నాయని చెప్పాలి. ఈ ట్రైలర్ లో వర్ష పై చూపించిన సీన్స్ కానీ హీరోతో తన కెమిస్ట్రీ వారి మధ్య బలమైన ప్రేమకథ కూడా కనిపిస్తుంది అనిపిస్తుంది.

ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ ట్రైలర్ లో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పవచ్చు. మొత్తానికి అయితే ఒక మిస్టరీ థ్రిల్లర్ ని నిర్మాణ సంస్థ హాస్య మూవీస్ వారు ఈ ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నారు. థియేటర్స్ లో ఎలాంటి ట్రీట్ ని అందిస్తుందో చూడాలి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు