‘ఆపరేషన్ వాలెంటైన్’ : గూస్ బంప్స్ రేంజ్ లో ఫస్ట్ సాంగ్ ‘వందేమాతరం’

‘ఆపరేషన్ వాలెంటైన్’ : గూస్ బంప్స్ రేంజ్ లో ఫస్ట్ సాంగ్ ‘వందేమాతరం’

Published on Jan 17, 2024 6:58 PM IST

యువ నటుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్ల పై సందీప్ ముద్ద, నందకుమార్‌ అబ్బినేని గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్నారు. వార్‌ డ్రామా నేపథ్యంలో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్‌ పైలట్‌గా నటిస్తుండగా మానుషి చిల్లార్‌ రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నేడు ఈ మూవీ నుంచి వందేమాతరం సాంగ్‌ ని రిలీజ్ చేసారు. కాగా దీనిని అమృత్‌సర్‌లోని చారిత్రక వాఘా సరిహద్దులో గ్రాండ్ గా కొద్దిసేపటి క్రితం రిలీజ్ చేసారు. వాఘా సరిహద్దులో సాంగ్ లాంఛ్ జరిగిన తొలి సినిమాగా అరుదైన రికార్డు ఈ మూవీ సొంతం చేసుకుంది. యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సాంగ్ వందేమాతరం అనే పల్లవితో సాగుతూ దేశభక్తిని చాటేలా గూస్ బంప్స్ తెప్పించడం ఖాయం. కాగా ఈ సాంగ్ ని రామజోగయ్య శాస్త్రి రచించగా సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు.

ఇక ఈ సాంగ్ ని ప్రముఖ గాయకుడు కునాల్ కుందు అద్భుతంగా ఆలపించగా కోరస్ ని రమ్య బెహరా, మిక్కీ జె మేయర్, కృష్ణ తేజస్వి అందించారు. ప్రస్తుతం ఈ సాంగ్ అందరినీ ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ రాబడుతోంది. తెలుగు, హిందీ బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్‌ను ఇప్పటికే విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి ఫిబ్రవరి 16న 2024 గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు