‘ఆపరేషన్ వాలెంటైన్’ : సిజి వర్క్ కి ఎంత ఖర్చు చేసారంటే ?

‘ఆపరేషన్ వాలెంటైన్’ : సిజి వర్క్ కి ఎంత ఖర్చు చేసారంటే ?

Published on Feb 28, 2024 10:24 PM IST

యువ నటుడు వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న తెలుగు, హిందీ భాషల ఆడియన్స్ ముందుకి రానున్న విషయం తెలిసిందే. ఈ మూవీని శక్తి ప్రతాప్ సింగ్ హడా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తుండగా మానుషీ చిల్లార్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఏరియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీలో థ్రిల్లింగ్ యాక్షన్ అంశాలు ఆకట్టుకుంటాయని, అలానే సిజి వర్క్ కూడా ఎంతో అద్భుతంగా వచ్చిందని అంటోంది టీమ్.

కాగా ఈ మూవీ యొక్క సిజి వర్క్ కోసం మొత్తంగా రూ. 5 కోట్ల మేర ఖర్చు చేసారట మేకర్స్. నవదీప్, రుహాణి శర్మ, మీరు సర్వార్ కీలక పాత్రలు పోషించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్, రెనైసెన్స్ పిక్చర్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో నిర్మించాయి. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ మూవీ లోని సాంగ్స్ తో పాటు టీజర్, ట్రైలర్ కూడా అందరినీ ఆకట్టుకుని మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. మరి రిలీజ్ అనంతరం ఆపరేషన్ వాలెంటైన్ ఏస్థాయి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు