సెన్సార్ పూర్తి చేసుకున్న “ఆపరేషన్ వాలెంటైన్”

సెన్సార్ పూర్తి చేసుకున్న “ఆపరేషన్ వాలెంటైన్”

Published on Feb 28, 2024 6:33 PM IST


టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు యూ/ఎ సర్టిఫికెట్ ను ఇవ్వడం జరిగింది.

ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలు ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకున్నాయి. మానుషి చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో రుహనీ శర్మ, మీర్ స్వరర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు