తెలుగు రాష్ట్రాల్లో “ఆపరేషన్ వాలెంటైన్” ప్రమోషన్స్ షురూ!

తెలుగు రాష్ట్రాల్లో “ఆపరేషన్ వాలెంటైన్” ప్రమోషన్స్ షురూ!

Published on Feb 20, 2024 9:34 PM IST

టాలీవుడ్ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హాడా దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం ఆపరేషన్ వాలెంటైన్. మార్చ్ 1, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. రిలీజైన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ను విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం కి సంబందించిన ప్రమోషన్స్ ను తెలుగు రాష్ట్రాల్లో షురూ చేయనున్నారు మేకర్స్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఫిబ్రవరి 21 న విజయవాడ, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో, 22 న మిలిటరీ మాధవరం, రాజమండ్రి, కాకినాడ, 23 న విశాఖ పట్టణం లో టీమ్ ప్రమోషన్స్ ను చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేయడం జరిగింది. మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించిన ఈ చిత్రం లో నవదీప్, మిర్ సర్వర్ లు కీలక పాత్రల్లో నటించారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు