“ఆపరేషన్ వాలెంటైన్” థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

“ఆపరేషన్ వాలెంటైన్” థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ ఫిక్స్!

Published on Feb 18, 2024 10:05 PM IST


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో, శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం లో తెరకెక్కిన చిత్తం ఆపరేషన్ వాలెంటైన్. పుల్వామా దాడి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మార్చి 1, 2024న తెలుగు మరియు హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. వరుణ్ తేజ్ ఎయిర్‌ఫోర్స్ పైలట్‌గా నటించగా, మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ లేడీ లీడ్ రోల్ లో నటించింది. కొద్దిసేపటి క్రితం, ఆపరేషన్ వాలెంటైన్ నుండి “ఫైనల్ స్ట్రైక్” (థియేట్రికల్ ట్రైలర్) ఫిబ్రవరి 20 న విడుదల కానుందని మేకర్స్ వెల్లడించారు.

నార్త్‌లో ప్రమోషన్లు చేసిన తర్వాత, టీమ్ ఇప్పుడు తెలుగులో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించింది. వరుణ్ తేజ్ గత రెండు చిత్రాలు (మల్టీ స్టారర్లు మినహా) ప్రేక్షకులను నిరాశపరిచాయి. అతను ఆపరేషన్ వాలెంటైన్‌తో మంచి సక్సెస్ పొందాలని చూస్తున్నాడు. సినిమా కంటెంట్ పై కూడా చిత్ర యూనిట్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు